Audiopedia Corona Campaign

కరోనా అంటే ఏమిటి మరియు దానికి సంబంధించి నేను ఏమిచేయగలను?

కరోనావైరస్ లేదా కరోనా ఒక చిన్న క్రిమి (మీ సాధారణ కంటితో చూడలేనంత చిన్నది), ఇది ప్రజల్లో వ్యాప్తి చెంది అస్వస్థత లేదా అనారోగ్యాన్ని కలిగిస్తుంది. కరోనా వల్ల పొడి దగ్గు, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండటం, జ్వరం మరియు ఒళ్ళు నొప్పులు వంటి ఫ్లూ లాంటి రోగలక్షణాలు ఏర్పడతాయి. కరోనా ముఖ్యంగా శ్వాసవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. చాలావరకు సంక్రామ్యతలు ప్రమాదకరం కానప్పటికీ, ఇది న్యూమోనియా (ఊపిరితిత్తులకు సంబంధించిన ఒక ప్రాణాంతక సంక్రామ్యత)ను దారితీయవచ్చు, ఇది అనేక కేసుల్లో ప్రాణాంతకం కావొచ్చు.

ఎవరికైనా కరోనా రావొచ్చు. వృద్ధులు మరియు ఇప్పటికే ఇతర అస్వస్థతలు ఉదాహరణకు, శ్వాస అస్వస్థతలు, క్యాన్సర్ లేదా మధుమేహం ఉన్న వ్యక్తులు మరింత తీవ్రమైన ప్రభావాలు ఎదుర్కొనేందుకు అధిక ప్రమాదం ఉంది.

కరోనా సోకిన వ్యక్తి శ్వాసించినప్పుడు, దగ్గినప్పుడు, లేదా వ్యక్తులు, ఉపరితలాలు, లేదా ఆహారంపై తుమ్మినప్పుడు విడుదల అయ్యే తుంపర్ల ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుంది. ఇది నోరు, ముక్కు మరియు కళ్ల ద్వారా శరీరంలోనికి ప్రవేశిస్తుంది. శరీరంలోనికి ప్రవేశించిన తరువాత, తన సంఖ్యను రెట్టింపు చేసుకొని ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందుతుంది. రోగలక్షణాలు కనిపించడానికి ముందు కరోనా 14 రోజుల వరకు శరీరంలో ఉండవచ్చు, అందువల్ల వ్యక్తులకు కరోనా ఉన్నప్పటికీ, దాని గురించి తెలియదు, అలానే వైరస్‌ని ఇతరులకు వ్యాప్తి చేస్తారు.

ప్రస్తుతం కరోనాకు ఎలాంటి వ్యాక్సిన్ లేదా నిర్ధిష్ట ఔషధం లేదు. కరోనాని యాంటీబయోటిక్స్ లేదా ఇంటి చికిత్స ద్వారా చంపలేం. దాని తాకకుండా మరియు తరచుగా చేతులు శుభ్రం చేసుకోవడ ద్వారా మాత్రమే కరోనాని నిరోధించవచ్చు.

సంక్రామ్యతను నిరోధించడానికి మీ చేతులను సబ్బు మరియు నీటితో శుభ్రం చేసుకోండి. మీ చేతులు మురికిగా లేనప్పటికీ కూడా మీ చేతులను శుభ్రం చేసుకోండి. సబ్బుతో 20 సెకండ్లపాటు ప్రవాహ నీటిలో బాగా కడుక్కోండి, వేళ్ల గోళ్ల కింద, మొత్తం చేయి మరియు మణికట్టును బాగా రుద్దుకోండి. మీ చేతులను సబ్బు మరియు నీటితో కడుక్కోవడం వల్ల మీ చేతులపై ఉండగల వైరస్‌లు చంపబడతాయి. మీరు ఆహారం తయారు చేయడానికి ముందు, తయారు చేసే సమయంలో మరియు తరువాత, మరుగుదొడ్డి ఉపయోగించిన తరువాత, తినడానికి ముందు, ఎవరైనా జబ్బుపడినవారి సంరక్షణ చేపట్టేటప్పుడు, జంతువులను తాకినప్పుడు మరియు జంతువుల వ్యర్థాలను పారవేసిన తరువాత, దగ్గడం, తుమ్మడం లేదా మీ ముక్కు చీదిన తరువాత ఎల్లప్పుడూ చేతులను కడుక్కోండి.

మీ చేతులు శుభ్రం చేసుకోకుండా మీ కళ్లు, ముక్కు మరియు నోటిని తాకవద్దు. చేయి అనేక ఉపరితలాలను తాకుతుంది, ఇది వైరస్‌లను తీసుకొని రాగలదు. కలుషితమైన తరువాత, చేతులు వైరస్‌లను కళ్లు, ముక్కు లేదా నోటికి బదిలీ చేయవచ్చు. అక్కడ నుంచి వైరస్ మీ శరీరంలోనికి ప్రవేశించి, మిమ్మల్ని అస్వస్థతకు గురి చేయగలదు.

జ్వరం, దగ్గు లేదా ఇతర శ్వాస సంబంధిత రుగ్మతలతో ఉన్న వ్యక్తిని దగ్గరగా తాకకుండా ఉండటం చాలా ముఖ్యం. దగ్గేటప్పుడు లేదా తుమ్మేటప్పుడు, మీ నోటికి మరియు ముక్కుకు మీ మడిచిన మోచేతి లేదా టిష్యూని అడ్డుపెట్టుకోండి. తరువాత ఉపయోగించిన టిష్యూని వెంటనే పారవేయండి. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయవద్దు.

దగ్గుతున్న లేదా తుమ్ముతున్నవారి నుంచి మీరు కనీసం 1 మీటర్ (3 అడుగులు) దూరంలో ఉండండి . జ్వరం లేదా దగ్గు ఉండే ఎవరినైనా తాకవద్దు.

జ్వరం, దగ్గు లేదా శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండే ఎవరైనా వ్యక్తి సంరక్షణ బాధ్యతలు చేపట్టాల్సి వస్తే, ప్రొటెక్టివ్ మాస్క్ లేదా బట్టతో చేసిన మాస్క్‌ ధరించండి మరియు మరిముఖ్యంగా చేతుల పరిశుభ్రత పాటించండి.

కరోనాని నిరోధించడానికి, ఇతరులను భౌతికంగా తాకకుండా ఉండటం మంచిది. కరచాలనం చేయడం మరియు తరువాత మీ కళ్లు, నోరు మరియు ముక్కు తాకడం వల్ల కరోనా మరియు ఇతర వైరస్‌లు వ్యాప్తి చెందవచ్చు. అందువల్ల, ఇతరులను కలిసేటప్పుడు, కరచాలనం చేయడం, కౌలిగించుకోవడం లేదా ముద్దు పెట్టుకోవడం ద్వారా పలకరించవద్దు. దానికి బదులుగా చేయి ఊపడం, తల ఊపడం లేదా ప్రణామం చేయడం ద్వారా వ్యక్తులను పలకరించండి. ఒకవేళ మీ ప్రాంతంలో కరోనా ఉన్నట్లుగా మీరు భావించినట్లయితే, ఇతరులను తాకకుండా పరిహరించడానికి ఇంటి వద్దనే ఉండండి.

మీకు అసౌకర్యంగా అనిపించినా, తలనొప్పి మరియు స్వల్పంగా ముక్కు కారడం వంటి స్వల్ప రోగలక్షణాలు ఉన్నా, మీరు రికవరీ అయ్యేంత వరకు ఇంటిలోనే ఉండండి. మీకు తుమ్ములు, పొడి దగ్గు, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండటం మరియు జ్వరం ఉన్నట్లయితే, సాధ్యమైనంత త్వరగా వైద్య సాయం పొందండి, ఇది శ్వాస సంక్రామ్యత లేదా ఇతర తీవ్రమైన పరిస్థితి కావొచ్చు.

కరోనాకు సంబంధించిన తప్పుడు నమ్మకాలు మరియు పుకార్లు చాలా ప్రమాదకరమైనవి మరియు ఇవి ప్రజలను చంపుతాయి. ఉదాహరణకు, బ్లీచ్ లేదా ఆల్కహాల్ వంటి పదార్థాలను తాకడం వల్ల కరోనాని నియంత్రించడానికి బదులుగా మీకు హాని చేస్తాయి. స్నేహితులు లేదా దగ్గర బంధువుల నుంచి మీరు పొందే సమాచారం కూడా తప్పుగా లేదా ప్రమాదకరంగా ఉండవచ్చు. మీ స్థానిక వైద్య ఆరోగ్యఅధికారుల నుంచి మాత్రమే సరైన ప్రజారోగ్య సలహాను పాటించండి.

ఈ సందేశాన్ని వ్యాప్తి చేయడం ద్వారా కరోనాపై పోరాడటానికి మీరు సాయపడగలరు. దయచేసి దీనిని మీ స్నేహితులు మరియు కుటుంబసభ్యులతో మరిముఖ్యంగా వాట్సప్ వంటి మెసేజింగ్ సర్వీస్ ఉపయోగించి పంచుకోండి.

ఈ కంటెంట్ ఆరోగ్య అవగాహన కలిగించే అంతర్జాతీయ ప్రాజెక్ట్ అయిన ఆడియోపీడియా ద్వారా అందించబడింది. www.audiopedia.org లోలో దీని గురించి మరింత తెలుసుకోండి.